బుల్లితెరపై ఇటీవల కాలంలో రొమన్స్ సీన్స్ పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయాయి. మితి మీరిన వల్గర్ పంచ్‌లతో.. హాస్యాన్ని అప హాస్యం చేసేలా బుల్లితెర యజమానులు పాటిస్పెంట్స్కు రైట్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కుటుంబం బుల్లితెర ప్రోగ్రామ్స్‌కు దూరమవుతున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో సుధీర్ – రేష్మీ, రవి – శ్రీముఖి ఇలా జంటలపై బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మర జంట చేరింది. హైపర్ ఆది – అనసూయ అనుకునేంతలా వారిద్దరి వ్యవహార శైలి మారింది. మొన్నటి వరకు మేడమ్ మేడమ్ అంటూ తిరిగిన హైపర్ ఆది.. ఇప్పుడు ఏకంగా అనసూయ అంటూ పేరు పిలుస్తూ.. కౌగిలింతలకు ఆహ్వానిస్తున్నాడు. ఇలా తాను పాల్గొనే ప్రతీ ప్రోగ్రామ్‌లోనూ అనసూయ ఉండేలా హైపర్ ఆది స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటున్నాడు. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో ఈ జంట పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగిపోవడం ఖాయంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు.