ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్య ఆదివారం కన్నుమూశారు. 86 ఏళ్ల సైదయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998లో ఓడిపోయారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మాచర్లలోని స్వగృహంలో ఉంచారు. సైదయ్య స్వస్థలం దుర్గి మండలం ఓబులేశునిపల్లి. పల్నాడు ప్రాంతంలో మంచి నాయకునిగా ఎదిగిన సైదయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంచి అనుబంధం ఉంది. సైదయ్య మృతితో ఆయన సహచరులు, బంధవులు విషాదంలో మునిగిపోయారు
