Home / MOVIES / బిగ్‌బాస్‌-2 ఫైనల్‌ లిస్ట్‌ ఇదే..!!

బిగ్‌బాస్‌-2 ఫైనల్‌ లిస్ట్‌ ఇదే..!!

నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా ఇవాళ సాయంత్రం బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా చక్కర్లు కొట్టాయి . అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నిర్వాహకులు, హోస్ట్‌ నాని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి పేర్లు మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని పరిశీలిస్తే…

1. సింగర్‌ గీతా మాధురి.. టాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌
2. తేజస్వి మదివాడ… టాలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించిన నటి.
3. నటుడు అమిత్‌ తివారీ.. విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్‌ , సన్నాఫ్‌ సత్యమూర్తి, తదితర చిత్రాల్లో నటించాడు.
4. నటుడు తనీష్‌.. బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన యువనటుడు.
5. నటుడు సామ్రాట్‌… అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలిచారు.
6. యాంకర్‌ దీప్తి… ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న దీప్తి నల్లమోతు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ లాంటి పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు.
7. బాబు గోగినేని… హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌.
8. రోల్‌ రిడా… రాహుల్‌ కుమార్‌ అలియాస్‌ రోల్‌ రిడా. రాప్‌ సింగర్‌.
9. శ్యామల… యాంకర్‌ శ్యామల. పలు చిత్రాల్లో కూడా నటించారు.
10. కిరీటి ధర్మరాజు… పలు షార్ట్‌ ఫిలింస్‌. టాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.
11. దీప్తీ సునయన… సోషల్‌ మీడియా సెన్సేషన్‌. డబ్‌ స్మాష్‌ వీడియోల‌తో బాగా పాపులర్‌. ఆ మధ్య నిఖిల్‌ కిర్రాక్‌ పార్టీలో కూడా ఓ పాత్రలో కనిపిgచారు.
12. సీరియల్‌ నటుడు కౌశల్‌
13. భాను… ???.

ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా గణేశ్‌‌, సంజన, నూతన్‌ నాయుడు అనే ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ షో ప్రారంభం కాబోతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat