ఈ ఏడాది మలేషియా లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా మహిళల జట్టు ఓటమి పాలైంది .బాంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి నిర్ణిత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి కేవలం నూట పన్నెండు పరుగులు మాత్రమే సాధించింది .
see also:ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..!
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నలభై రెండు బంతుల్లో ఏడు ఫోర్లతో యాభై ఆరు పరుగులను సాధించడం మినహా ఎవరు రాణించలేదు .నూట పదమూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా రుమానా అహ్మద్ (23పరుగులు ,22బంతుల్లో ఒక ఫోర్ )రాణించడంతో ఆ జట్టు గెలుపొందింది. దీంతో ఆసియా కప్ బంగ్లా సొంతమైంది .