ఖైదీల విడుదలను కూడా ఏపీ ప్రభుత్వం రాజకీయం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన ఖైదీలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాజకీయ సిఫారసుల ఆధారంగా ఖైదీలను విడుదల చేస్తున్నారనడానికి తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోనే నిదర్శనం.
see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..!
రిజబ్లిక్‌డే రోజు సందర్బంగా ఖైదీలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడే విడుదల చేసింది. ఏపీలోని వివిధ జైళ్లల్లో శిక్ష అనుభవిసతున్న 49 మందిని విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సత్ప్రవర్తన ఆధారంగా ఖైదీలను విడుదల చేసేందుకు గత నెల 17న ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం వివాదస్పదమవుతోంది. కేవలం కొంతమందికి మేలు చేసేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇటు రాజకీయ విశ్లేషకులతోపాటు.. అటు మేధావులు సైతం వ్యతిరేకిస్తున్నారు.
see also:వెలుగులోకి సంచలన నిజాలు..!
అయితే, ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. రాగిపిండి సుధాకర్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి. రాజారెడ్డి కేసులో శిక్ష పడిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారే కావడం గమనార్హం. అయితే, రాజారెడ్డిని విడుదల చేస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో పూర్తిగా రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.