వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానుల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించేలా నిర్ణయించిన విషయం తెలిసిందే. జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న ఆద్యాంతం ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలను చూపుతున్నారు. ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇస్తున్నాడు. కాగా, జగన్ తన పాదయాత్రను ఎనిమిది (కడపర, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో పూర్తి చేసి.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్నారు.
see also:మహిళపై లైంగిక దాడి కాదు..బాలుడిపై ఓ మహిళ లైంగిక దాడి
అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఓటమికి గల కారణాలను జగన్ పాదయాత్ర నేపథ్యంలో వైసీపీ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితి 2019లో రివర్స్ అయ్యేలా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీకి ప్లస్ కాబోతోంది.
see also:వైఎస్ జగన్ నిడదవోలులో భారీ బహిరంగ సభ..!
see also:
అందులో భాగంగా, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ పార్లమెంట్ సీట్ల కేటాయింపుతోపాటు.. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తలు వహిస్తున్నారు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు పోతోంది వైసీపీ. ఇప్పటికే మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్‌ను ఏలూరు పార్లమెంటు సీటు సమన్వయ కర్తగా నియమించిన విషయం తెలిసిందే. అలాగే, మాజీ మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్, మాజీ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్‌లపై కూడా వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇలా ఒక్కొక్క నియోజకవర్గంపై ప్రత్యక దృష్టి సారిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు వైసీపీ ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తోంది.
see also:జగన్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్షణ..!
see also: