ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సర్కార్ పనితీరును పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రజలు నిలదీశారు. కాగా, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను నిడదవోలు ప్రజలు కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకుంటున్నారు. అయితే, జగన్ పాదయాత్ర నిడదవోలు వైపుగా వెళుతున్న సమయంలో.. అటువైపుగా పొలాల బావి నుంచి బిందెల్లో తాగు నీరు తెచ్చుకుంటున్న మహిళలు కలిశారు.
వారు తాగుతున్న నీటిని జగన్‌కు చూపించి ఆవేదన వెలిబుచ్చారు. అవి మురికి నీరుగా ఉన్నాయి. నీటిని గమనించిన జగన్ చలించి పోయారు. ఈ నీటినా మీరు తాగేది అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆవేదనకు స్పందించిన జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే.. నిడదవోలులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇలా జగన్ ప్రజల సమసయలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేశిష్తున్నారు.