మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం .ఇటివల అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత ఒక ప్రముఖ నటుడ్ని ప్రేమించా అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ గతంలో విఫలమైన తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది.
see also:‘దేశంలో దొంగలు పడ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
ఆమె మాట్లాడుతూ మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం)చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర కథ మొత్తం నా జీవితంలో జరిగినట్లు అనిపించింది .అంటే నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించాను .అయితే కొన్ని కారణాల తర్వాత అతని నుంచి విడిపోయాను .అలా దూరం కాకుండా ఉండి ఉంటె నా జీవితం కూడా మరో సావిత్రి జీవితంలా అయ్యేది .
see also;విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!!
అయితే నా టైం బాగుండి నాగచైతన్య నా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు అని సమంత చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇలాంటి విషయాలను చెప్పడానికి ధైర్యం కావాలి .అది అక్కినేని కోడలు సమంతలో టన్నుల టన్నుల ఉందని అర్ధమవుతుంది కదా అని నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు …..