టాలీవుడ్ హాట్ భామ రెజీనా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ఇంత వరకు తనకు నచ్చిన వ్యక్తి తనకు తారస పడలేదని, ఒక వేళ తనకు నచ్చేలా ఎవరైనా తారస పడితే.. ఆ వ్యక్తి గురించి ఇంట్లో చెప్పి వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటానని రెజీన తెలిపింది.
అంతే కాకుండా, పెళ్లి అయిన తరువాత కూడా తన పిల్లలను షూటింగ్ స్పాట్‌కు తీసుకొస్తానని కూడా చెప్పింది. టాలీవుడ్‌లో విద్యా బాలన్, కరీనాకపూర్ లు పెళ్లి అయిన తరువాత కూడా నటిస్తున్నారని, వారిలానే తాను కూడా నటిస్తానని రెజీనా చెప్పింది.