టాలీవుడ్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రామీణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గంలో తనపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని అన్నారు. అనధికారికంగా రోజుకు రూ.6లక్షల ఆదాయం పొందుతున్నట్లు పవన్ ఆరోపణ చేశారని .. దీన్ని 15 రోజుల్లోగా ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపించలేని పక్షంలో క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో పవన్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
