ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలవడా ..మరోసారి ముఖ్యమంత్రి కాలేడా ..అంటే అవుననే అంటున్నారు భారతీయ జనత పార్టీ ప్రధాన కార్యదర్శి సి.మురళీధరరావు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా
చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యం ..
మేము తలచుకుంటే ఆయన జీవితంలో ఇక ముఖ్యమంత్రి కాలేడు అని అన్నారు.గత నాలుగు ఏండ్లుగా తమతో రాసుకొని పూసుకొని తిరిగిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుండి బయటకు రావడానికి ప్రధాన కారణం ఏమి అని ఆయన ప్రశ్నించారు .
గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు .ఇప్పుడు ఎన్నికలకు పోతే ప్రజలు ఛీ కొడతారు అని వారి భయం అని ఆయన అన్నారు …