ఒకపక్క ఎమ్మెల్యే ..మరో పక్క అధికారం ఉన్నదనే మదంతో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై అధికార పార్టీ నేత దాడికి దిగిన సంఘటన ఇది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న శుక్రవారం రాత్రి భాగ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్ దా మేనల్లుడు అక్కడున్న అధికారి గదిలోకి చొరబడి నీళ్ళ బాటిల్ ను దొంగతం చేశాడు .
అయితే అదే సమయంలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్ సంతోష్ అది గమనించి అతన్ని నిలువరించే ప్రయత్నం చేశాడు .ఈ విషయం తెలుసుకొన్న దేవ్ దా కొడుకు అక్కడకి వచ్చి అతన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా సంతోష్ మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు.
పైగా దొంగతనం చేయడం తప్పు అని చెప్పాడు .దీంతో ఎమ్మెల్యే కొడుకు అయిన నాకే ఎదురుతిరుగుతవా అని అతనిపైకి దాడికి దిగాడు సదరు ఎమ్మెల్యే కొడుకు .ఆ సమయంలో అక్కడకి వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో సంతోష్ చెంపలను అటు ఇటు వాయిస్తూ ఎంత ధైర్యం రా నీకు .మావాళ్ళనే అడ్డుకుంటావా చంపేస్తా అంటూ సభ్యపదజాలంతో సంతోష్ పైకి దాడికి దిగాడు ..