తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ , ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అస్సలు ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. రాజకీయంగా చూస్తే ఎన్టీఆర్ పక్కా తెలుగుదేశం. తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి దగ్గరుండి మరీ ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్.
see also:వైఎస్ జగన్ ఎప్పుడూ చేయని విధంగా..!!
అయితే ఒకరోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చారు వైఎస్ జగన్. శంషాబాద్ విమానాశ్రయంకు జగన్ చేరుకున్న సమయంలో అక్కడే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారని ఇద్దరూ రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నారని ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఇది పక్కా మార్ఫింగ్ అని స్ఫష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు దీనీకి మసాలా తోడు చేసి లక్షలమంది సెల్ఫీలు తీసుకుని ఉంటారు. కానీ నేనూ మీరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ అని అన్నాడని కూడ అంటున్నారు.