ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయం. అయినా, చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. 2014 ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. ఇంతకీ చంద్రబాబును అంతలా వణికిస్తున్న ఆ భయం ఏమిటి..? అన్న విషయం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
అయితే, ఏపీ రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైసీపీ ఉద్యమాలు, పోరాటాలు, బంద్‌లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదాపై వైసీపీ తన పట్టును వీడలేదు. పోరాడుతూనే ఉంది. అందులో భాగంగా వైసీపీ ఎంపీలు సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలను ఇటీవల కాలంలో పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు.
ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు వస్తే ఎక్కడ ఓడిపోతామోనన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకతతో తల్లడిల్లుతున్న చంద్రబాబు సర్కార్.. సాధారణ ఎన్నికలకంటే ముందుగా.. ఎంపీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడ ప్రజల వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందోనని చంద్రబాబు ఆలోచనలో పడ్డారని, ఉప ఎన్నికలు కనుక జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.