రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు .
తాజాగా విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా తెలుగులో విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా ఇప్పటికే రూ.12 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులను ఆదుకునేందుకు తనవంతుగా ప్రతి సినిమా టిక్కెట్ పై ఒక్క రూపాయి ఇస్తానని ప్రకటించాడు. దీంతో విశాల్ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. కోట్లకొద్ది రెమ్యూనరేషన్లు తీసుకునే హీరోలు విశాల్ చూసైనా కాస్త సమాజం కోసం ఆలోచించాలని కోరుతున్నారు.