ఏమన్నావు బాబూ..! బాబూ చిట్టీ.. ఠిఠిఠిఠీ..! అంటూ టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ఓ వీడియో వైరల్ అవుతుండటం ప్రతీ ఒక్కరికి తెలిసి నవిషయమే. ఎవరైనా ప్రముఖులు మాట్లాడుతూ.. వారి నోట నుంచి ఆణిముత్యాలు జారినప్పుడు ఇటువంటి ఆడియోను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు అటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సినీ నటుడు, ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణ వీడియో.
అయితే, శుక్రవారం అనంతపురం జిల్లాలోని హిందూపురంలో నిర్వహించిన నవ నిర్మాన దీక్షలో ఎమ్మెల్యే స్థాయిలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. జాతీయ పార్టీల ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం ఏపీ విభజన అంశమేనని అన్నారు. అయితే, ఏపీ విభజనకు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ పక్క ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమైక్య ఆంధ్రకు మద్దతు తెలుపుతూ మీడియా సాక్షిగా మాట్లాడుతుంటే.. చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఒక మాట, ఏపీలో ఒక మాట చెప్తూ చివరకు ఏపీ ప్రజలను నట్టేట ముంచారు. అంటే, అప్పటి జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతోపాటు, ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన విషయాన్ని బాలకృష్ణ మరిచిపోయి.. రాష్ట్ర విభజన పాపం కేవలం కాంగ్రెస్, బీజేపీలదేనంటూ నవ నిర్మాణ దీక్షలో మాట్లాడారు.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. రాష్ట్ర విభజన సమయంలో సమైక్య ఆంధ్రకు మద్దతుగా జరిగిన ఉద్యమాల్లో నువ్వు పాల్గొన్నావా..? కనీసం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇప్పుడు అన్యాయంగా విభజించారంటూ ఉపన్యాసాలు దంచికొడుతున్నావు.. చివరకు చంద్రబాబు సైతం విభజన జరగకుండా అడ్డుపడలేదంటూ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.