ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ మోడల్‌గా మార్చేసింది. అమరావతిని అభివృద్ధి పేరిట సింగపూర్ కంపెనీలకు అమాంతం రాసేశారు. భూమి, వసతులు, పెట్టుబడులు ఏపీ ప్రభుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాలను ఏపీ ప్రభుత్వం రాసిచ్చేసింది.
see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
అక అసలు విషయానికొస్తే.. రాజధాని అమరావతి ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చాయి. సింగపూర్ కంపెనీల గొంతెమ్మ కోర్కెలన్నిటికీ ఏపీ సీఎం అంగీకరించారు. అమరావతి సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి సంబంధించిన జాయింట్ మోనటరింగ్ కమిటీ మూడవ సమావేశంలో కీలక ఒప్పందాలు జరిగాయి. అమరావతి అభివృద్ధిలో భాగస్వాములైన ఏడీసీ, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ కంపెనీల మధ్య షేర్ ల ఒప్పందం జరిగింది. అత్యంత వివాదస్పదమైన ఈ ఒప్పందం ద్వారా సింగపూర్ కంపెనీలపై చంద్రబాబు సర్కార్ అత్యంత ప్రేమను చూపించింది.
see also:వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు విడుదల..!
ఈ ఒప్పందంలో ఏపీకి చెందిన ఏడీసీకి కేవలం 42 శాతం మాత్రమే వాటా దక్కగా సింగపూర్ కంపెనీలకు మాత్రం 58 శాతం వాటాలు కేటాయించారు. దీని ప్రకారం ఏడీసీలో వచ్చే లాభాల్లో అగ్ర భాగం సింగపూర్ కంపెనీలకే పోతుంది. దీంతోపాటు సీఆర్డీఏ. ఏడీసీల మధ్య నిర్మాణం ,అభివృద్ధి ఒప్పందం కూడా సాగింది. ఈ ఒప్పందం ప్రకారం సింగపూర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేయనున్నాయి.
see also:ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.
మాటి మాటికి సింగపూర్ పేరును జపించే చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు అడగకుండానే లబ్ధిని చేకూర్చడం అనుమానాలకు తావిస్తోంది. సీడ్ క్యాపిటల్ 1691 ఎకరాల్లో మూడు విడతల్లో నిర్మాణం చేపట్టనున్నారు. తొలి విడతలో 650 ఎకరాల్లో అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఇందులో కోట్లు విలువ చేసే 50 ఎకరాల భూమిని నామినల్ ధరకే సింగపూర్ కంపెనీలకు రాసిచ్చేశారు. ఇప్పుడు అందులో జీరో ఫేస్ పేరుతో ఎగ్జిబిషన్‌ను, డెవలప్‌మెంట్ మోడల్‌ను ఏర్పాటు చేస్తామని సింగపూర్ కంపెనీలు మెలిక పెట్టాయి.
see also:వెలుగులోకి సంచలన నిజాలు..!
ఇప్పుడు భూముల కేటాయింపుల్లోనూ భారీ కుంభకోణానికి తెర తీశారు. 1,691 ఎకరాల సీడ్ క్యాపిటల్ కు కేటాయించిన భూమిని ప్రభుత్వం కేవలం 12.02 లక్షల అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర సంస్థలకు ఇచ్చిన ధరల ప్రకారం అయితే 1,691 ఎకరాలు 6,764 కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. కానీ ప్రభుత్వం వాటి విలువను రూ.140 కోట్ల 62 లక్షలుగా నిర్ధారిస్తూ జీవో చేసింది. అంటే ఇక్కడే ప్రభుత్వానికి 6,623 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఇదంతా ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే. ఇలా చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ భారీ అవినీతి కుంభకోణాలకు పాల్పడుతోంది.