ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక…మా ఎంపీలను విమర్శించడం హేయమని కర్నూల్ జిల్లా ఆదోని నియోజక వర్గ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవనకొండ మండలంలో గురువారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో వైసీపీ ఎంపీలపై బుట్టా చేసిన విమర్శలపై శుక్రవారం ద్వారకా ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మండిపడ్డారు.
ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు… ఆమరణ దీక్షలపై బుట్టా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. హోదా, డబ్బుకోసం పార్టీ ఫిరాయించిన మీకు రాజకీయ విలువలు ఏమి తెలుసని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేప్పుడు నోరు అదుపులోఉంచుకోవాని, లేని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో మీకు పోటిగా వైసీపీ కార్యకర్తను నిలబెట్టి మరి అఖండ మెజార్టితో గెలిపించగల ధమ్ము జగన్ దగ్గర..కర్నూల్ జిల్లా వైసీపీ నాయకులు దగ్గర ఉందని అన్నారు.
జగన్ ప్రజా సంకల్పయాత్రకు జనం నీరాజనం పలుకుతున్న తీరును ఓర్వలేక విమర్శలు చేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. సమావేశంలో వైసీపీ ఎస్సీ సెల్‌మండల అధ్యక్షుడు కల్లుపోతుల సురేష్, మహిళౠ విభాగం నాయకురాలు శ్రీలత, కౌన్సిలర్ సుధాకర్, నాయకులు రామలింగేశ్వర యాదవ్, నజీంవలి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.