ఆంధ్రప్రదేశ్ లో విభజన కష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్రయాణించిన వాతావరణం వేడి మాత్రం తగ్గలేదు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు బాబు పాలన ఎలా ఉంది? ప‌్రజలు ఆయనకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటిపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగే ఫలితాలే వచ్చాయట. ఒక్కసారి మనం చూద్దాం
క్రిష్ణా ,గుంటూరు జిల్లాల ఇంటెలిజెన్స్ ప్రస్తుత సర్వే:
క్రిష్ణా జిల్లా:
టీడీపీ గెలిచే సీట్లు:
విజయవాడ ఈస్ట్, కైకలూరు, పెనమలూరు,గన్నవరం.
వైసీపీ గెలిచే సీట్లు:
విజయవాడ వెస్ట్,గుడివాడ, పెడన,మచిలీపట్నం, నందిగామ ,నూజివీడు.
హోరాహోరి పోటీ ఉన్న సీట్లు:జగ్గయ్యపేట, మైలవరం, పామర్రు,తిరువూరు, అవనిగడ్డ,విజయవాడ సెంట్రల్.
గుంటూరు జిల్లా:
టీడీపీ గెలిచే సీట్లు: పొన్నూరు, చిలకలూరిపేట, తెనాలి,తాడికొండ, వినుకొండ, గురజాల,వేమూరు.
వైసీపీ గెలిచే సీట్లు: నరసరావుపేట, మంగళగిరిసత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల, ప్రత్తిపాడు,గుంటూరు ఈస్ట్.
హోరాహోరీ పోటీ : రేపల్లె,పెదకూరపాడు,గుంటూరు ..కేవలం ఇప్పటి పరిస్థితుల బట్టి మాత్రమే సర్వే చేశారు…అభ్యర్థుల సెలక్షన్ బట్టి ఫలితాలు మారొచ్చు .అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటున్న రాజధాని జిల్లాలోనే టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే మిగితా జిల్లాల సంగతి మీరే ఊహించుకోండి. ఇవే కాకుండా అన్ని సర్వేలు వైసీపీ విజయం అని స్ఫష్టంగా తెలియజేశాయి. ఏది ఏమైన ఏపీలో మాత్రం 2019 లో జరిగే ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయని తెలుస్తుంది.