ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు.
SEE ALSO:
ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితోలో లేరని తెలిపారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ రెడ్డికు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో చూపిస్తారని ప్రజలను ఎంపీ మిథున్ రెడ్డి కోరారు.
SEE ALSO: