Home / ANDHRAPRADESH / ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్… ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజీనామా

ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్… ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజీనామా

ఏపీలో టీడీపీకి మరో అతి పెద్ద షాక్ తగలనుందా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి.. ఇప్పటికే ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు..మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు వైసీపీలోకి చేరడంతో టీడీపీ 2019 లో ఓటమి ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. అంతేగాక ప్రస్తుతం ఉన్న టీడీపీలో కొందరు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజాగా ఒక కీలక నేత పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, కేబినెట్‌లోనే కీలక హోంశాఖ పదవిలో ఉన్న నిమ్మకాయల చినరాజప్ప తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నినెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడం, హోంమంత్రిని కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడుతూ వస్తున్నారు.

see also:

ఇది అందరికీ తెలిసిందే. ఒక శాఖలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖపై పట్టు ఏర్పరచుకోవాలి. కానీ నాలుగు సంవత్సరాలవుతోంది. ఇప్పటివరకు తన శాఖ గురించి పూర్తిగా చినరాజప్పకు తెలియదంటూ కొంతమంది మంత్రులు మాట్లాడుకోవడం హోంమంత్రి విన్నారట.  అంతేకాదు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళారట. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని చినరాజప్పను తేల్చి చెప్పారట. కనీసం తాను చెప్పినదానికన్నా మంత్రులను అడగాల్సిన బాధ్యత ఉన్న సీఎం తనను తక్కువ చేసి మాట్లాడడం చినరాజప్పకు ఏ మాత్రం ఇష్టం లేదట.

see also:జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..!

see also:

దీంతో అలకపాన్పు ఎక్కి పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చేసినట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ప్రస్తుతానికి టిడిపి నుంచి దూరమవుతున్నా.. ఆ తరువాత ఏదో ఒక పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు హోంమంత్రిని బుజ్జగించేందుకు ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపారట.

see also:గుతికోటలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు

see also:

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat