గత కొంతకాలంగా టీం ఇండియాకి చెందిన ఆటగాళ్ళు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం.తాజాగా మరో టీం ఇండియా ఆటగాడు వీరి సరసన చేరాడు .ఈ ఏడాది హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ లో సత్తా చాటిన టీం ఇండియా బౌలర్ సందీప్ శర్మ ఎంగేజ్మెంట్ అయింది.
ఈ విషయం గురించి సందీపీ శర్మ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు .అంతే కాకుండా తను పెళ్లి చేస్కోబోయే అమ్మాయితో కల్సి దిగిన ఫోటోను కూడా ట్విట్టర్ లో పోస్టు చేశాడు.ఈ సందర్భంగా ఇట్స్ అఫీషియల్ అని పేర్కొన్న సందీప్ పక్కనే ఉంగరం గుర్తు ను జతచేశాడు.తన ఇంట అడుగుపెట్టే అమ్మాయి పేరు తాషా సాత్మిక్ గా పేర్కొన్నాడు