ఫిదా చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ సాయిపల్లవి. మొదటి చిత్రంతోనే టాప్ హీరోయిన్‌గా సాయిపల్లవి గుర్తింపు తెచ్చుకుంది. అటు టాలీవుడ్‌తోపాటు, అటు కోలీవుడ్‌లోనూ సాయి పల్లవి వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. సూర్య, ధనుష్ లాంటి స్టార్‌ల పక్కన జతకడుతోంది.
see also;
తాజాగా సాయి పల్లవి కోలీవుడ్ హీరో సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం సాయి పల్లవి 1.8 లక్షల పారితోషకాన్ని అందుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం గ్లామర్ ఉన్న స్టార్ హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే, సాయి పల్లవి తన గ్లామర్‌తోపాటు, నటనతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలసిందే.
see also: