ఆపరేషన్ గరుడ.. తెర వెనుక ఉన్న నేత ఎవరో తెలిస్తే షాక్..! అవును, ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలతోపాటు దేశ రాజకీయ నాయకుల నోళ్లల్లో నానున్న మాట ఆపరేషఫన్ గరుడ. ఇందుకు సంబంధించి టాలీవుడ్ సినీ నటుడు తన ఇంటిలో ఏకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆపేషన్ గరుడ మ్యాప్‌ను కూడా గీశాడు. అంతేకాకుండా, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశాడు. చంద్రబాబుపై కుట్ర జరుగుతుందంటూ.. అందుకు ప్రధాని మోడీ ఆపరేషన్ గరుడ పేరుతో ప్రణాళికలు అమలు చేస్తున్నారని ఆ వీడియోలో నటుడు శివాజీ చెప్పుకొచ్చాడు.
see also:వైఎస్ జగన్ పాదయాత్రలో జనసందోహాన్ని చూసి.. టీడీపీలో వణుకు
అంతేకాకుండా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా ఏ సభ ఏర్పాటు చేసినా.. ఆ సభలో
ఆపరేషఫన్ గరుడ గురించి చెప్తూ.. నాపై కుట్ర జరుగుతోంది తమ్ముళ్లూ, నన్ను అరెస్టు చేస్తే మీరే నన్ను కాపాడాలి తమ్ముల్లూ అంటూ ప్రసంగాలు ఇవ్వడం పరిపాటిగా మారింది.
see also:అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పాదయాత్ర..!
ఇక అసలు విషయానికొస్తే.. ఆపరేషన్ గరుడ రూపకర్త ఎవరో తెలిసిపోయింది. ఈ విషయాన్ని ఏపీ మాజీ సీఎస్ ఐవీఆర్ తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ ఆపరేషన్ గరుడ రూపకర్త అని, ఆపరేషన్ గరుడను నిజం అని ప్రజలను నమ్మించే క్రమంలో నటుడు శివాజీతో కలిసి చంద్రబాబు నాటకాన్ని రక్తికట్టించారని ఐవీఆర్ విమర్శించారు.
see also:
ఆఖరుకు తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు జగన్‌ను బహిరంగంగా కలిసినా.. దాన్ని ఆపరేషన్ గరుడ అంటూ చెప్పడం చంద్రబాబు 40 ఏళ్ల నీచ రాజకీయాలకు మాత్రమే సాధ్యమన్నారు ఐవీఆర్.
see also: