తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మే 14 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,20549 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.పరీక్షలకు హాజరైనవారిలో 1,25,960 మంది విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాశారు.
see also: