స్వచ్ఛ తెలంగాణలో భాగంగా జీహెచ్ఎంసీ నగరంలో వేర్వేరుగా పొడి చెత్త, తడి చెత్త సేకరణ కోసం ప్రతి కుటుంబానికి రెండు చెత్త డబ్బాలను అందజేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఒక వైపు తన అధికార కార్యక్రమాలను నిర్వర్తిస్తూనే..స్వచ్చ హైదరాబాద్ లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన తడి చెత్త పొడి చెత్త ను వేరుచేసి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుంది హైదరాబాద్ వెస్ట్ జోనల్ కమిషనర్ ,ఐఏఎస్ అధికారిణి దాసరి హరిచందన.
SEE ALSO:కాబోయే పీఎం కేసీఆర్..సీఎం కేటీఆర్..!!
మొదటగా ఓ గృహాణి లా,తదుపరి ఓ అధికారిణి గా ఆమె తన ప్రయత్నాన్ని ఇంట్లో స్వయంగా చేసి చూపిస్తుంది.ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా రెండు మట్టి కుండల్లాంటి బాక్సులను ఏర్పాటు చేసి..స్వయంగా వాటిల్లో చెత్తను నిలవ చేస్తున్నారు.వంట గది నుంచి నిత్యంసేకరించే వృధా ఆహార పదార్ధాల ద్వారా బయోగ్యాస్ ను తయారు చేసి చూపిస్తానని ఆమె తెలిపారు.
SEE ALSO:నేడు ఏడువేల మందికి సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు..!
జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్లో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే అధికారిణి అయినప్పటికీ ఇంట్లో మాత్రం గృహణీ లా చెత్తను వేరు వేరుగా సేకరిస్తూ….స్పూర్తిగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా ప్రజలకు ప్రతి ఇంట్లో తప్పకుండా ఇలాంటి ప్రయత్నం జరగాలని సూచించారు.