మరోసారి టీడీపీ నేతలు పప్పులో కాదు.. కాదు.. బురదలో కాలేశారు. మొఖాన్ని పైకెత్తి ఆకాశంపై ఉమ్మితే.. అది ఉమ్మిన వాడి మొఖానే పడినట్టు.. జగన్‌పై బురదజల్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు.. ఆ బురద తమకే అంటుకునేలా జగన్‌పై విమర్శలు చేశారు.
SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..!
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్ జగన్‌ను కలిసిన తిరుమలలో టీడీపీ సర్కార్ చేస్తున్న అక్రమాలపై వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేసేందుకు తమకు అవకాశం దొరికిందిలే అంటూ టీడీపీ నేతలు ఆనందపడ్డాడు. అంతటితో ఆగక అప్పటికప్పుడు మీడియాను పిలిచి సమావేశం పెట్టారు. జగన్‌పై విమర్శలు చేడయం మొదలు పెట్టారు. అన్యమతస్థుడైన జగన్‌ను రమణదీక్షితులు ఎలా కలుస్తారు..? అంటూ మీడియా సాక్షిగా జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించడం టీడీపీ నేతల వంతైంది.
SEE ALSO:కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
ఇలా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై. అయితే, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న కామెంట్లను పరిశీలిస్తే..
అవును, వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు.. ప్రజా నాయకుడు. అందుకే రమణ దీక్షితులు వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రజా నాయకుడు కాబట్టే మతాలతో సంబంధం లేకుండా వారి వారి సమస్యలను చెప్పుకునేందుకు పలువురు జగన్ వద్దకు వెళ్తున్నారు అంటూ టీడీపీ నేతలపై కౌంటర్లు పడుతున్నాయి.
SEE ALSO:
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పొలిటికల్ సూపర్ స్టార్ అంటూ మరో సోషల్ మీడియా కథనం పేర్కొంది. ఆ కథనం జగన్‌ను పొలిటికల్ సూపర్ స్టార్‌గా పేర్కొనడమే కాకుండా.. ఆధారాలను కూడా ప్రచురించింది.
మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకు చెప్పిన మాట ఒకే ఒక్కటే. జగన్ 2014 ఎన్నికల్లో ఒక్కడే పోటీ చేశాడని.
SEE ALSO:లగడపాటి ఉత్తరాంధ్ర జిల్లాల సర్వే లీక్..!
జగన్ ఒక్కడే కలిసి కూటమిగా ఏర్పడ్డ బీజేపీ, టీడీపీ, జనసేనలను ఎదుర్కొన్నాడనే అర్థం. అంటే జగన్ దమ్మున్న ప్రజా నాయకుడిగా రెండు జాతీయ పార్టీలతో సహా, ఒక ప్రాంతీయ పార్టీని సైతం ఎదుర్కొన్నాడు.
బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అన్నీ కలిసినా కూడా కేవలం 2 శాతం ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అబద్ధపు హామీలు ఇవ్వడం ద్వారా గెలిచే అవకాశం ఉన్నా.. జగన్ అమలుకు వీలుకాని అబద్ధపు హామీని ఇచ్చేందుకు దైర్యం చేయలేదు. చంద్రబాబులా రాష్ట్ర ప్రజలను వంచించడానికి జగన్ సాహసించలేదు. ఇలా వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కాకుండా.. ప్రజా నేతగా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరవవుతున్నారు.
SEE ALSO: