Home / ANDHRAPRADESH / గుతికోటలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు

గుతికోటలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు

గుతికోటలో గత నెల 26న సంచలనం సృష్టించిన గుర్తు తెలియని యువకుడి హత్య కేసును గుత్తి పోలీసులు చేధించారు. హత్యకు గురైన యువకుడి ఫొటోలను టీవీలు, పేపర్లో ప్రచురించినా ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే లుక్‌ అవుట్‌ నోటీసులు (ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర వాటి ద్వారా) ఇవ్వడంతో పోలీసులకు కొన్ని క్లూస్‌ దొరికాయి. కర్నూల్‌కు చెందిన పవన్‌ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం హతుడు గద్వాల్‌ జిల్లాలోని జిమ్మిచెడుకు చెందిన సుమంత్‌గా గుర్తించాడు. దీంతో పోలీసులు జిమ్మిచెడు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో సుమంత్‌ పరిచయాలపై ఆరా తీశారు. జిమ్మిచెడు గ్రామానికి చెందిన పౌల్‌ రాజు, శివకుమార్‌ల వెంట గత నెల 26న బయటకు వెళ్లాడని గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా హంతకులు పౌల్‌ రాజు, శివకుమార్‌లేనని తేల్చారు.

see also:

చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై..ఛార్జ్‌షీట్‌

see also:

ఇందులో భాగంగానే స్థానిక పోలీసు స్టేషన్‌లో గురువారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ఆ వివరాలను తెలిపారు. హంతకులు పౌల్‌ రాజు, శివకుమార్‌లు గత కొంత కాలంగా సుమంత్‌పై కక్ష పెంచుకున్నారని, హతుడు సుమంత్‌… పౌల్‌రాజు భార్యపై అత్యాచారం చేయడంతో పాటు శివకుమార్‌ సోదరిపై కూడా లైంగికదాడికి పాల్ప డ్డాడన్నారు. అంతటితో ఆగకుండా అడ్డుచెప్పిన శివ కుమార్‌ను చాలాసార్లు సుమంత్‌ చితకబాదాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్న శివకుమార్, పౌల్‌రాజులు ఎలాగైనా సుమంత్‌ను హత్య చేయాలని గత నెల 25న పథక రచన చేశారని చెప్పారు. ఈ క్రమంలో గత నెల 26న గుత్తిలోని స్వస్థత శాల (చర్చి)కు సుమంత్‌ను వారు వెంట తీసుకెళ్లారని తెలిపారు. గుత్తికొండ చాలా బాగుందని అక్కడ మందు కొడదామని సుమంత్‌ను వారు నమ్మించారన్నారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత శివకుమార్, పౌల్‌రాజులు బండరాళ్లతో కొట్టి సుమంత్‌ను చంపేశారన్నారు. తర్వాత మృతదేహాన్ని బావిలో పడేశారని పేర్కొన్నారు. గురువారం గద్వాల్‌ రైల్వేస్టేషన్‌లో హంతకులు శివకుమార్, పౌల్‌రాజులను అరెస్టు చేసి గుత్తి స్టేషన్‌కు తీసుకొచ్చామని తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారని చెప్పారు. హత్య కేసును చేధించిన ఎస్‌ఐ వలిబాషా, పోలీసు కానిస్టేబుళ్లు మోహన్, సురేష్‌లను సీఐ ప్రభాకర్‌గౌడ్‌ అభినందించారు.

see also:

see also:ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat