రంజాన్ నెల ఉపవాస దీక్షలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు.అందులోభాగంగానే ఏడువేల మందికి సరిపడేలా ప్రభుత్వం ఇఫ్తార్ ఏర్పాట్లుచేసింది. అయితే దావతే ఇఫ్తార్ కు రావాల్సిందిగా ఇప్పటికే అందరికి ఆహ్వానకార్డులు పంపిణీ చేశారు.
see also:
400 మంది వీవీఐపీలు, మరో 1000 మంది వీఐపీలు, 5600 మంది సామాన్య ముస్లింల కోసం స్టేడియం ప్రాంగణంలో గ్యాలరీలు ఏర్పాటు చేశారు . ఇఫ్తార్ తరువాత అక్కడే నమాజ్ (ప్రార్థనలు) కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మగ్రీబ్ నమాజ్ అనంతరం విందు ప్రారంభమవుతుంది. జంటనగరాల్లోని 16 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 200 మందికి ఆహ్వానాలు పంపించారు.
see also:
రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలోని 800 మసీదుల వద్ద శుక్రవారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 400 మసీదులు, జిల్లా ప్రాంతాల్లో 400 మసీదుల వద్ద ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున అందించింది. నిరుపేద ముస్లింలకు ఒక్కో కుటుంబానికి మూడు జతల దుస్తులతో కూడిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను శుక్రవారం నుంచి మసీదు కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు .కాగా ఈ నెల 10న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.
see also: