అనంతపురంలో జిల్లాలోని ఓ యువకుడు మద్యం మత్తులో చేసుకున్న పని ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన రాయదుర్గంలో గురువారం జరిగింది. హోటల్ పని చేసుకుంటూ జీవించే గోవిందరాజులు (36) కుటుంబ సమేతంగా గొందిబావి ప్రాంతంలో నివసిస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలతో కలసి భార్య పుట్టింటికి వెళ్లింది. తల్లి అక్క వాళ్ల ఇంటికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న గోవిందరాజులు గురువారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడికి ఏమైందో తెలీదుగానీ కత్తితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నొప్పి భరించలేక ఇంటి వద్ద ఉన్న మరొకరిని ఆశ్రయించి కాపాడాలని రోదించాడు. దీంతో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
SEE ALSO: