ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ పాదయాత్రలో భాగాంగ నిడదవోలు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం వైసీపీ పార్టీలో చేరారు. పాదయత్ర యాత్ర చేస్తోన్న వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీలోకి వచ్చారు. తణుకు ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ వద్ద పార్టీ నిడదవోలు కన్వీనర్ జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో కొవ్వూరు వ్యయసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ డీవీ కృష్ణారావు, కాంగ్రెస్ నాయకులు అడ్డాల గోవిందు, అడ్డాల శ్రీనివాసరావు, అనిశెట్టి శ్రీనివాసరావు పార్టీలో చేరారు.
జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి వీరిని ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని కొత్తగా చేరినవారు ప్రకటించారు. పార్టీ నిడదవోలు పట్టణ అధ్యక్షుడు మద్దిపాటి ఫణీంద్ర, మండల కన్వీనర్ అయినీడి పల్లారావు, పువ్వల రతీదేవి, రంగారావు, ప్రభు, శ్యాంబాబు పాల్గొన్నారు.