ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు రావచ్చని ,వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని పార్లమెంటుకు రాజీనామా చేసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. అయితే ప్రత్యేక హోదాపై యు టర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమపై పోటీ పెడతామని అంటున్నారని, తద్వారా ప్రత్యేక హోదా ఆశయాన్ని ఆయన నీరుకార్చడానికి ఆలోచిస్తున్నారని , బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి ఎవరు నమ్మక ద్రోహం చేశారో ప్రజలకు వివరిస్తాం. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఎన్నడూ హోదా అడగని చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఆడుతున్న డ్రామాలను ప్రజలకు వివరిస్తాం. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత తీవ్రంగా ఉందో ఉప ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రానికి తెలియజేస్తామని ఆయన అన్నారు.
see also:భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు