ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది’ అని జగన్ తన ట్వీట్లో ఎంపీలను అభినందించారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా వైసీపీ ఎంపీలకు ప్రశంసలు వస్తున్నాయి. తెలుగు ప్రజలు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్లుకుంటారంటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Proud of our MPs who stood firm on their resignations & ensured their acceptance, showing that APSCS is of utmost priority. Your sacrifice will not go waste & will be etched in AP’s history.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2018