ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని ఎదుర్కొనేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..దీనిలో భాగంగానే కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
see also:ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము సిద్దం..వైసీపీ ఎంపీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. నాలుగేళ్లు రాజధాని కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీని ఎంత తొందరగా పంపితే ప్రజలకు అంత మంచిదని చెప్పారు.
see also:భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు