ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జడివానను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వేస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. ఈ పాదయాత్ర నడిపల్లికోట నుంచి కానూరు క్రాస్ రోడ్డుకు జగన్ పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రికి జననేత ఇక్కడే బస చేస్తారు. 183 రోజులనుండి ఇప్పటివరకు పాదయాత్రలో జగన్ 2,268.4 కిలోమీటర్లు నడిచారు.
see also:మీ త్యాగం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది..వైఎస్ జగన్ ట్వీట్