ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియపై గవర్నర్‌కు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా, మంత్రి అఖిల ప్రియను బర్త్‌రఫ్ చేయాలంటూ వినతి పత్రం కూడా అందజేశారు. కాగా, గురువారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ వారు ప్రధాని మోడీపై చెప్పరాని మాటలతో విమర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఇటీవల భూమా అఖిల ప్రియ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.
see also:ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము సిద్దం..వైసీపీ ఎంపీ ..!
మంత్రి స్థాయిలో ఉన్న భూమా అఖిల ప్రియ చెప్పవీలు కాని రీతిలో, మాటలతో ప్రధాని మోడీపై విమర్శలు చేసిందన్నారు. మంత్రి అఖిల ప్రియను వెంటనే బర్త్‌రఫ్ చేయాలంటూ కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థ టీడీపీ కార్యకర్తల్లా మారిందన్నారు. టీడీపీ వారు చెప్పిందే తప్ప.. సామాన్యులకు పోలీసులు సేవ చేయడం లేదని మీడియాతో చెప్పారు కన్నా లక్ష్మీ నారాయణ.
see also:బీజేపీ కొత్త స్కెచ్…బాబు టీంలో వణుకు…తర్వాత ఏంటి?