స్టార్ భార్యల మధ్య ఛాలెంజ్ వార్..! అవును ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ ఇటీవల ఫిట్‌నెస్ పై అవగాహన పెంచేందుకు హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ అనే పేరుతో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది కాస్తా టాలీవుడ్‌కు పాకింది.
ఇప్పటికే ఈ ట్రెండ్‌లో భాగంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం ఒకరికి మరొకరు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విసిరారు. ఇలా టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లపై దృష్టి సారించింది. అయితే, ఇది కాస్తా స్టార్ హీరోల సతీమణులకు సైతం పాకింది. అయితే, ఇటీవల అక్కినేని వారి కోడలు సమంత రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు ఫిట్‌నెస్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఛాలెంజ్‌ను స్వీకరించిన ఉపాసన తనకు తెలిసిన వ్యాయామాలు చేసి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఉపాసన టాలీవుడ్ సూపర్ స్టార్ నమ్రతకు ఫిట్నెస్ ఛాలెంజ్ చేసింది. మరీ నమ్రత ఎటువంటి వీడియోను పోస్ట్ చేస్తుందోనని అభిమానులు తెగ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.