టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే, చిరంజీవి తన రీఎంట్రీ కోసం ఖైదీ నెం.150 లాంటి రీమేక్ చిత్రంతో సేఫ్ గేమ్ ఆడిన చిరు.. ఆ తరువాత పెద్ద సాహసాన్నే చేస్తున్నాడు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న సైరాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ చిత్రం ఏకంగా రూ.220 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అందుకుతోడు సురేందర్‌రెడ్డి లాంటి దర్శకుడిని ఈ చిత్ర దర్శకుడిగా ఎంపిక చేయడం మరో సాహసం. వీటన్నిని పరిగణలోకి తీసుకున్న నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరుండి పనులన్నిటిని చూసుకుంటున్నాడ. అయితే, ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సైరా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం ఇప్పటి నుంచే వర్క్‌ను ప్రారంభించారు.