బాగా తెలిసిని వ్యక్తులకు , లేదా ఇండస్ట్రీ వర్గాలకు తప్ప స్టార్ హీరోయిన్, హీరోల వ్యవహారాలు, వారి వివరాలు బయటివాళ్లకు పెద్దగా తెలియదు. ‘ఫలానా సమయంలో నా అసిస్టెంట్ ఇచ్చిన సలహా బాగా పనికొచ్చింద’ని ఏ హీరోయిన్ల్ చెప్పుకోవడం కూడా అరుదుగా వింటాం. వీటన్నింటికీ విరుద్ధంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ చేసిన పని ప్రస్తుతం వైరల్ అయింది. అసలేం జరిగిందంటే
‘‘నా అసిస్టెంట్ కుమార్ ఇంత మంచిగా డాన్స్ చేయగలడని అస్సలు తెలీదు సుమీ! బహుశా లాంగ్ షూటింగ్ అవర్స్‌లో అతని స్టెప్స్‌ని రహస్యంగా షూట్‌చేసి ఉంటారు’’ అంటూ రకుల్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేయగానే ఇలా నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది.