టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ కు అరుదైన గౌరవం లభించింది.పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ కమిటీలో సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.సభ్యులుగా సరోజ్‌పాండే, భుబనేశ్వర్‌కాలిత, రవిప్రకాష్‌వర్మ, ఎస్సార్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సంతూసేన్, కహకషాన్ పేర్వీన్, కనకమేడల రవీంద్రకుమార్, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కే సోమాప్రసాద్, అహ్మద్ అశ్వాక్ కరీమ్, వందన చవాన్‌లను నియమించినట్టు రాజ్యసభ అదనపు డైరెక్టర్ రాజేంద్ర తివారీ తెలిపారు. 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. ఎంపీ ల్యాడ్ పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా సాగేం దుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది.