ఆస్తమా రోగులకు జూన్ 8వ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అవుతుంది. మొత్తం చేప ప్రసాదం పంపిణీకి 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ, వికలాంగులకు స్పెషల్ కౌంటర్లు ఉన్నాయి. వృద్దులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
అందరూ ఒకేసారి రాకుండా.. టోకెన్ల విధానం అమలు చేస్తున్నారు. ఇందు కోసం 34 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్ల పంపిణీ చేపట్టారు. ఇప్పటికే లక్షా 30వేల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేశారు. మత్స్యశాఖ నుంచి 350 మంది సిబ్బంది ఈ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేప ప్రసాదం కోసం వేలాది మంది తరలి వస్తుండటంతో.. భ్రదతపైనా దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. 1500 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితేనగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకోవటానికి ఆర్టీసీ 133 ప్రత్యేక బస్సులు నడుపుతుంది.