మొబైల్ వినియోగదారులకు గూగుల్ సంస్థ శుభవార్త చెప్పింది . డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ రైల్ టెల్ సహకారంతో 2016 జనవరిలో తొలిసారిగా ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఇప్పుడు వీటి సంఖ్యను పెంచింది.
భారత రైల్వే శాఖ అనుబంధ టెలికాం సంస్థ రైల్ టెల్ సాయంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది .ఉచిత వైఫై సేవల కల్పనకు భారత రైల్వే 2015లో గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
వైఫై సేవలను ప్రారంభించిన తొలి ఏడాది 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసును అందించారు. ఈ రోజు అసోంలోని డిబ్రుగఢ్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై ఏర్పాటుతో రైల్వేస్టేషన్ల సంఖ్య 400కు చేరింది.