తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖలో 18,428 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది.
see also:ఒకే ఒక్కడు పరీక్ష ..తనిఖీ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించిన పోస్టులను ఇందులో భర్తీ చేస్తున్నారు. వీటన్నింటికి మూడేళ్ల వయో పరిమితిని పెంచతున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది.ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బోర్డు వెబ్‌సైట్ (www.tslprb.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు కూడా వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.