Home / POLITICS / కాంగ్రెస్ నేత‌ల‌పై డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌..!!

కాంగ్రెస్ నేత‌ల‌పై డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌..!!

కాంగ్రెస్‌లో విబేధాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. ఇప్ప‌టికే ఎవ‌రికి వారుగా కాబోయే సీఎం తానే అంటే తానేన‌ని చెప్పుకుంటుండ‌టం ఆ పార్టీ ప‌రువును ప‌లుచ‌న చేస్తుండగా….తాజాగా సీనియ‌ర్ల మ‌ధ్య కొత్త వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌డంపై ఆ పార్టీలో విబేధాల‌ను మ‌రోమారు తెర‌మీద‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. నాగం ప్ర‌త్య‌ర్థి యిన ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి దీనిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం, పార్టీ మారేందుకు సిద్ధ‌మయ్యారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో అనూహ్యంగా మాజీ మంత్రి డీకే అరుణ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. దామోద‌ర్ రెడ్డి అసంతృప్తి వెనుక అరుణ ఉన్నార‌ని కొన్ని మీడియాల్లో….అరుణ చెప్తు…దామోద‌ర్ రెడ్డి పార్టీ వీడ‌ర‌ని మ‌రికొంద‌రు పార్టీ నేత‌లు పేర్కొన్నారు.

see also:ఈ సారి కలెక్టర్‌ ఆమ్రపాలి ఏం చేసిందో తెలుసా..!

ఇలా వివిధ ర‌కాల‌ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో డీకే అరుణ మీడియా ముందుకు వ‌చ్చారు. దామోదర్‌రెడ్డిని కలిసి మాట్లాడానని, పార్టీ మార్పు ఆలోచన విరమించుకోండ‌ని సూచించిన‌ట్లు తెలిపారు. `నాగం చేరిక సమయం లో.. నా బాధ , నా మాట ఎవరు  వినలేదు అనే బాధ ను దామోదర్ రెడ్డి వ్యక్తం చేశారు. నాగంకు టికెట్ ఫైనల్ అవ్వలేదు. రాహుల్ దృష్టికి మీ ఆందోళ‌న‌ను తీసుకెళ్దాం“ అని హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా డీకే అరుణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `డీకే అరుణ చెబితే దామోదర్ రెడ్డి వింటారని అంటున్నారు. నన్ను ఇబ్బంది పెట్టే ప్రక్రియ అది. ఇది ఒక రాజకీయ కుట్ర…ఎవరు ఇబ్బంది పెట్టినా…నన్ను టార్గెట్ చేసినా..ఎవరు టార్గెట్ చేసిన భయపడి ఇంట్లో కూర్చోను..నేను సిన్సియర్ కార్యకర్తను… కాంగ్రెస్ గెలుపు కోసమే నా పని..“ అంటూ త‌న మ‌న‌సులోని మాట‌ను డీకే అరుణ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు.

see also:పోలీసు ఉద్యోగాలకు వయసు సడలింపు..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat