అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతానికి తోడుగా ఆయన మంత్రివర్గ సహచరులు ముఖ్యనేతలు చేస్తున్న ఎదురుదాడిపై బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టడమే..టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టేందుకు కారణమైంది. ఏకంగా బీజేపీ ఎప్రత్యక్ష ఎదురుదాడికి దిగుతుండటంతో సైకిల్ పార్టీ నేతల్లో భయం మొదలైందని అంటున్నారు.
బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పిన అనంతరం ఆ పార్టీపై టీడీపీ తమదైన శైలిలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వ్యక్తిగతం కూడా ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మోడీ అత్యాచారాలు చేయమన్నాడని మంత్రి అఖిలప్రియ ఆరోపించడం తీవ్ర వివాదాస్పదం అవగా…చంద్రబాబ నమ్మినబంటు అనే పేరున్న ఏపీ ప్రణాళికసంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు మోడీ దిమ్మతిరిగే స్కాంను త్వరలో్ బయటపెడతామని ప్రకటించడం ఈ వివాదాని మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల వైఖరిని బట్టబయలు చేసేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ మేరకు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయాలకు విలువలకు పెద్దపీట వేసే పార్టీ అని డబ్బా కొట్టుకోవడమే తప్ప ఆచరణలో అలాంటి వైఖరి లేదన్నారు. మహిళా మంత్రి అత్యాచారాల గురించి ప్రధానిపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆమెతో పాటుగా కుటుంబరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులుగా పేరొందిన ఇద్దరు కీలక నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వాటిపై గవర్నర్‌కు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని టీడీపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది.
Tags bjp BJP's new sketch chandra babu kanna lakshmi narayana