బుల్లితెరపై చేసే ప్రోగ్రామ్స్ విజయం సాధించాలంటే చాలానే కష్టపడాలి. కొంత మంది అయితే బుల్లితెరపై లేని ప్రేమను ఒలకబోస్తుంటారు. మరికొంత మంది జరగని దానిని, జరగినట్టు, జరిగిన దానికి ఇంకొంత ఎపెక్ట్స్‌ను జోడిస్తూ బుల్లితెరపై చెబుతుంటారు. అసలే రేటింగ్స్ మీద ఆధారపడ్డ బుల్లితెరకు అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే రేటింగ్స్ పెరిగేది మరీ.
అయితే, బుల్లితెర యాంకర్స్‌లో సుమ స్టార్ ఇమేజ్‌ను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ సుమ కనబడితే చాలు ఆ షో హిట్టయినట్టే అనేంతలా పాపులర్ అయింది. అయితే, ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా చేసిన సుమకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రోగ్రామ్‌లో భాగంగా డ్యాన్స్ చేస్తున్న సుమ.. కాలు జారి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మోకాలి చిప్పల వద్ద కాస్త గాయమైనట్టు సమాచారం. అయితే, వెంటనే వైద్య శాలకు తరలించడంతో ప్రమాదం తప్పింది.