Home / ANDHRAPRADESH / ఎయిర్ ఏషియా కుంభ‌కోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్ర‌బాబు ఫోన్‌..!

ఎయిర్ ఏషియా కుంభ‌కోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్ర‌బాబు ఫోన్‌..!

ఇప్ప‌టికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం చంద్ర‌బాబు మెడ‌కు మ‌రో ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ముఖ టీడీపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎయిర్ ఏషియా కుంభ‌కోణంలో ఇరుకున్నారంటూ ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో వార్త‌లు సంచ‌ల‌నమ‌య్యాయి. అంతేకాకుండా, ఎయిర్ ఏషియా కుంభ‌కోణంలో చంద్ర‌బాబు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు అరెస్టు కాబోతున్నారంటూ కూడా ప‌లు సోష‌ల్ మీడియాలు ప్ర‌సారం చేశాయి. దీనికంత‌టికి కార‌ణం, ఇటీవ‌ల ఎయిర్ ఏషియా సీఈవోకు సంబంధించిన ఫోన్ కాల్ సంభాష‌ణ‌లో చంద్ర‌బాబు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు పేర్లు విన‌ప‌డ‌ట‌మే. ఈ నేప‌థ్యంలో ఈ కేసును కూడా ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు సీఎం చంద్ర‌బాబు అశోక్ గ‌జ‌ప‌తిరాజుతో ఫోన్‌లో మాట్లాడాడ‌ని, ఆ వివ‌రాలు మీ కోసం అంటే ఓ సోష‌ల్ మీడియా క‌థ‌నం ప్ర‌చురించింది.

see also:వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు..!

ఇక ఆ క‌థ‌నానికి సంబంధించిన వివ‌రాలిలా ఉన్నాయి.. మ‌లేషియాకు చెందిన బ‌డ్జెట్, ఎయిర్‌లైన్స్ సంస్థ 2014లో టాటా గ్రూప్‌తో క‌లిసి దేశీయ విమాన‌యాన రంగంలోకి అడుగుపెట్టాయి. అయితే, విమాన‌యాన రంగం నిబంధ‌న‌ల ప్ర‌కారం స్థానికంగా ఐదు సంవ‌త్స‌రాల‌పాటు స‌ర్వీసులు న‌డిపి 20 విమానాలు క‌లిగిన సంస్థ‌కు మాత్ర‌మే అంత‌ర్జాతీయ స‌ర్వీసుల‌ను న‌డిపేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తుంది. ఈ నిబంధ‌న‌ను ఆర్టిక‌ల్ 5/20కింద పొందుప‌రిచారు.

అయితే, ఈ నిబంధ‌న‌కు అప్ప‌టి కేంద్ర మంత్రి, టీడీపీ నేత‌ అశోక్ గ‌జ‌ప‌తిరాజు తూట్లు పొడిచారు. నిబంధ‌న‌ను మార్చి మ‌రీ ఎయిర్ ఏషియాకు అనుమ‌తులు ఇచ్చారు. అయితే, అశోక్ గ‌జ‌ప‌తిరాజు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి మ‌రీ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ప‌లు అంత‌ర్జాతీయ విమాన‌యాన‌రంగ సంస్థ‌లు వ్యతిరేకించాయి. అయినా, అశోక్ గ‌జ‌ప‌తిరాజు నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కి మ‌రీ ఎయిర్ ఏషియా సంస్థ‌కు అనుమ‌తులు మంజూరు చేశారు.

see also:పవన్ కళ్యాణ్‌పై సీఎం రమేష్ సంచలన వాఖ్యలు..!

ఇలా అశోక్ గ‌జ‌ప‌తిరాజు కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన ఈ భారీ కుంభ‌కోణంపై ఇప్పుడు సీబీఐ విచార‌ణ జ‌రుపుతోంది. అందులో భాగంగా సీబీఐ ప‌లు ఆడియో టేప్‌ల‌ను కూడా రాబ‌ట్ట గ‌లిగింది. అందులో భాగంగానే ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్‌, ఇండియా సీఈవో మిట్టూ శాండిల్య మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌ను ఇటీవ‌ల మీడియా కూడా ప్ర‌సారం చేసింది. అయితే, సుమారు కొన్ని గంట‌ల‌పాటు మాట్లాడుకున్న వారి మాట‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి.

see also:వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో కలకలం..10 మందికి గాయాలు

‘మనకు ఎలాగైనా కొన్ని రూట్ల ఇంటర్నేషనల్ పర్మీషన్లు కావాలని, అడ్డదారిలో వెళ్లైనా పర్మిట్లు సాధించాలి’ అని టోనీ ఫెర్నాండేజ్ మిట్టూ శాండిల్యతో అన్నాడు. దీనికి ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పట్టుకుంటే పని అవుతుంది, ఆయన మనిషే ఇప్పుడే విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు’ అని మిట్టూ సమాధానం ఇచ్చాడు. ఇలా వారి సంభాష‌ణ‌ల్లో చంద్ర‌బాబు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు పేర్లు వెల్ల‌డి కావ‌డంతో వారిద్ద‌రిపై సీబీఐ నిఘా పెంచింది. ఈ నేప‌థ్యంలోనే సీఎం చంద్ర‌బాబు అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు ఫోన్ చేసి సీబీఐ విచార‌ణ వివ‌రాల‌పై ఆరా తీసిన‌ట్టు సమాచారం.

see also:వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat