2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం కదా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారందరినీ ప్రలోభాలకు గురి చేశారు. చివరకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్రమే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు.
see also:ఎయిర్ ఏషియా కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్రబాబు ఫోన్..!
అయితే, నెల్లూరు జిల్లాల్లో ఉన్న పది అసెంబ్లీ సీట్లలో ఏడు వైసీపీ కైవసం చేసుకోగా.. మూడింటిని (కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి) టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాల్లో అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసేందుకు వైసీపీ గత నాలుగు సంవత్సరాల నుంచే ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా టీడీపీ ప్రభుత్వం హాయంలో జరిగిన కుంభకోణాలను వైసీపీ వెలుగెత్తి చాటుతోంది. చంద్రబాబు అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇలా వైసీపీ దూకుడును చూసిన రాజకీయ విశ్లేషకులు 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం కన్ఫామని, పదికి పది అసెంబ్లీ సీట్లను గెలవడం ఖాయమంటూ అంచనా వేస్తున్నారు.