ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఘోరం జరిగింది. నగరంలోని సూర్యమహల్ సెంటర్‌లో ఫ్లెక్సీ అమర్చుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాక సందర్భంగా 30 అడుగుల ఫ్లెక్సీని అభిమానులు రెడి చేశారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు శివ, నాగ రాజులు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ వైర్లు తగిలి షాక్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరు తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు.ఈ ఘటనపై ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
see also;