తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆర్చ్ ఫార్మా ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ DXN సంస్థ సిద్దిపేట ప్రాంతానికి రావడానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
see also:సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!!
మందపల్లి, ముడ్రాయి, మిట్టపల్లి చుట్టూ ప్రాంతంలో ఈ DXN జపాన్ కంపెనీని స్థాపించడం వల్ల సిద్దిపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగఅవకాశాలు వస్తాయని తెలిపారు.ఈ సంస్థ ను 150 ఎకరాలలో సుమారు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని .త్వరలోనే DXN జపాన్ సంస్థ కంపెనీకి భూమి పూజ కార్యక్రమం ఉంటుందని అన్నారు.ఈ కంపెనీలో ఆహారం వస్తువులనుతయారు చేస్తారని తెలిపారు.
see also:ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!!
ఈ కంపెనీ స్థాపించడం కోసం కృషి చేసిన మంత్రి హరీష్ రావు.సీఎం కేసీఆర్.dxn జపాన్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు. త్వరలో మరిన్ని పరిశ్రమలు మంత్రి హరీష్ రావు కృషి వల్ల రాబోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగ ప్రవీణ్ రెడ్డి, మంచే నర్సింలు, ఐలయ్య, పయ్యావుల రాములు, రంగదాంపల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుమల్ రెడ్డి, భూపాల్, సునీల్ గౌడ్, దనంజయ్ రెడ్డి, చింతల శ్రీనివాస్, చింతల మల్లయ్య, చైతన్య యాదవ్, బూమలింగం, శ్రీశైలం పాల్గొన్నారు.